కుల బహిష్కరణ చేసి వేధిస్తున్నారు

0

అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: తమ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసి వేధిస్తున్నారని ఆలూరుకు చెందిన సుమలత ప్రజావాణిలో సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. తనకు ఆలూర్‌ శివారులో 4.20 ఎకరాల భూమి ఉందని, 55 ఏళ్లుగా సాగుచేసుకుంటున్నామని వివరించారు. అయితే మున్నూరుకాపు సంఘం సభ్యులు తమను పిలిచి సర్వే నంబర్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారన్నారు. తమ కుటుంబ సభ్యులందరం ఇందుకు ఒప్పుకోకపోవడంతో మమ్మల్ని కులబహిష్కరణ చేశారని వివరించారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నారు.