అక్షరటుడే, ఇందూరు: ఆర్మూరు – నిజామాబాద్ మార్గంలో రాకపోకలు నిలిపివేయడంతో గ్రూప్-3 పరీక్షలు రాసే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అడవి మామిడిపల్లి వద్ద ఆర్‌యూబీ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో నెలరోజుల పాటు రాకపోకలు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా చూసుకోవాలన్నారు.