అక్షరటుడే, కామారెడ్డి: పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్‌కు తావులేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. జిల్లాలో 11,962 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందుకోసం 62 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో డీఈవో రాజు, పరీక్షల సహాయ కమిషనర్ లింగం, ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిర, డీఎంహెచ్‌వో లక్ష్మణ్ సింగ్, పొలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
‘పది’ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
Advertisement
Advertisement