అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వీరయ్య బుధవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వారిని మార్నింగ్ కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ అహ్మద్ మొయినుద్దీన్ ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష, ముగ్గురికి రూ.8 వేల జరిమానా విధించారు.