జితేందర్‌రెడ్డి ఇంటికి రేవంత్‌రెడ్డి

0

అక్షరటుడే వెబ్‌డెస్క్‌: మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్‌రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం వెళ్లి కలిశారు. మహబూబ్‌నగర్‌ బీజేపీ ఎంపీ టికెట్‌ ఆశించినా జితేందర్‌రెడ్డికి చివరకు నిరాశే ఎదురైంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో సత్సంబంధాల కారణంగా తనకు టికెట్‌ వస్తుందని ఆయన చివరి వరకు వేచిచూశారు. కానీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు టికెట్‌ కేటాయిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి జితేందర్‌రెడ్డిని కలవడంతో ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలు మొదలయ్యాయి.