అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ ప్రాజెక్టు అనుసంధానంగా ఉన్న చేప పిల్లల విత్తనోత్పత్తి కేంద్రానికి పూర్వవైభవం తీసుకు వస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో సోమవారం ఆయన చేప పిల్లలను విడుదల చేశారు. మత్స్య కార్మికుల జీవనోపాధి కోసం ప్రభుత్వం రాయితీపై చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో ఈ సంవత్సరం 24 లక్షల చేప పిల్లలను వదులుతామని తెలిపారు. కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక కో ఆపరేటివ్ రాష్ట్ర ఛైర్మన్ మెట్టు సాయికుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఎఫ్డీవో డోలి సింగ్, నాయకులు మల్లికార్జున్, ఆకాష్, బాల సాయిలు, గంగి రమేష్, రామకృష్ణ, లక్ష్మయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.