అక్షరటుడే, జుక్కల్ : బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం నిజాంసాగర్ మండలంలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. నిజాంసాగర్‌లో నూతనంగా ప్రారంభించిన జూనియర్ కళాశాలను సందర్శించారు. కాలేజీలో 22 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ప్రతిరోజు ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువ హాజరు కాకపోవడంతో తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు కళాశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. మందులు ఉన్నాయా అని వైద్యుడు రోహిత్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయుష్ ఆస్పత్రిని సందర్శించారు. ఆమె వెంట తహశీల్దార్ భిక్షపతి, మండల విద్యాశాఖ అధికారి తిరుపతిరెడ్డి ఉన్నారు.