అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మాక్లూర్ మండలం ఒడ్యాట్ పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించిన అనంతరం రైస్ మిల్లుల వద్ద ఎక్కడైనా తరుగు, కడ్తా పేరిట కోతలు అమలు చేస్తున్నారా అని రైతులను ఆరా తీశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీసీవో శ్రీనివాస్ తదితరులున్నారు.