అక్షరటుడే, ఇందూరు: రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి సంబంధించి 2024-25 సంవత్సరానికి గాను బిల్లుల నిధులను విడుదల చేసినట్లు డీఈవో అశోక్ తెలిపారు. సీసీహెచ్(కుక్ కం హెల్పర్)ల గౌరవ వేతనం రూ.2వేల చొప్పున మొత్తం రూ.1.31 కోట్ల బడ్జెట్ మండలాల వారీగా రిలీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే మండల విద్యాధికారులకు గౌరవ వేతనాలు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. తొందరలోనే బిల్లులు సీసీహెచ్ ల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.