ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు!

0

అక్షరటుడే, నిజామాబాద్: జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.