అక్షరటుడే, కోటగిరి: కారుకు సైడ్ ఇవ్వబోయి లారీ కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తా పడిన ఘటన పోతంగల్ మండలంలో చోటుచేసుకుంది. శనివారం వరి ధాన్యం లోడ్ చేసుకునేందుకు లారీ హెగ్డోలి వెళ్తుండగా.. ఎదురుగా కారు రావడంతో సైడ్ ఇచ్చే ప్రయత్నంలో కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడు. కల్వర్టు వద్ద ఎలాంటి సూచికలు లేకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. గతంలో కూడా ఇలాగే ఒక కారు దూసుకెళ్లిందని పేర్కొన్నారు. వెంటనే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.