అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడలో ఆదివారం సాయంత్రం పద్మశ్రీ, సహస్ర అవధాని గరికిపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రవచన సభా స్థలాన్ని శనివారం గురుస్వాములు పరిశీలించారు. భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో గురుస్వాములు శంకర్, మల్లికార్జున్, రాజు, లక్ష్మీనారాయణ, వీరప్ప తదితరులు పాల్గొన్నారు.