అక్షరటుడే, ఆర్మూర్: ప్రధాని మోదీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 26న తలపెట్టిన ‘చలో నిజామాబాద్’ను జయప్రదం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కోరారు. ఆర్మూర్ లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ చట్టాలను తెచ్చి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతోందని అన్నారు. సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్య శివాజీ, నాయకులు చిట్టక్క, ధనలక్ష్మి, ప్రిన్స్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.