అక్షరటుడే, వెబ్‌డెస్క్ : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఓ నటుడికి భారీ షాక్ ఇచ్చాయి. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడు అజాజ్ ఖాన్ మహారాష్ట్రలోని వెర్సోవా అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేశారు. అజాజ్‌ఖాన్‌కు ఇన్‌స్టాగ్రాంలో 56 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆయన పోటీచేసిన స్థానంలో ఇప్పటి వరకు 146 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నోటాకు 874 నోట్లు రావడం గమనార్హం.