అక్షరటుడే, వెబ్డెస్క్: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ‘ఎక్స్’ వేదికగా ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ‘‘అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయి. కలిసికట్టుగా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించగలం. చరిత్రాత్మక విజయాన్ని అందించిన మహారాష్ట్ర ఓటర్లు ముఖ్యంగా మహిళలు, యువతకు ధన్యవాదాలు. మహారాష్ట్ర అభ్యున్నతికి ‘మహాయుతి’ కృషి చేస్తుందని ప్రజలకు హామీ ఇస్తున్నా’’ అని మోదీ ట్వీట్ చేశారు.