అక్షరటుడే, ఎల్లారెడ్డి: నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామంలో గల త్రిలింగేశ్వర ఆలయంలో ఈ నెల 29న 101 జంటలతో రుద్ర హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షుడు దత్తుగుప్తా తెలిపారు. ఆసక్తి గల భక్తులు ఒకరోజు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. హోమంలో పాల్గొనే దంపతులు మంగళహారతి, కలశం వెంట తెచ్చుకోవాలన్నారు. ఉదయం 8 గంటలకు ఆలయానికి రావాలని కోరారు.