అక్షరటుడే, జుక్కల్: పెద్దకొడప్ గల్ మండలం కాటేపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ ఎం బాలరాజు తన కూతురు నిహారిక జ్ఞాపకార్థం పరీక్ష ప్యాడ్‌లు పంపిణీ చేశారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పలకలు, పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్‌లు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో ప్రవీణ్ కుమార్, గ్రామస్థులు మల్లప్ప పటేల్, మొగులాగౌడ్, విఠల్, హన్మాండ్లు, చాంద్ పాషా పాల్గొన్నారు.