అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది మహమ్మద్ ఖాసింపై దాడిచేసిన ఖాన్ బ్రదర్స్ ను కఠినంగా శిక్షించాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహమ్మద్ ఖాసిం కార్యాలయ స్థలాన్ని విక్రయించాలంటూ హర్షద్ ఖాన్, ముజఫర్ ఖాన్, ముజాహిద్ ఖాన్ లు బెదిరించి దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. న్యాయవాదులపై గుండాగిరి చేసి దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ బార్ అసోసియేషన్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, సురేష్, దీపక్, అపూర్వ, కవిత, మాణిక్ రాజు, బాలాజీ, కృష్ణానంద్, ఆశ నారాయణ తదితరులు పాల్గొన్నారు.