అక్షరటుడే, జుక్కల్ : కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యంలో ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం నిజాంసాగర్ మండలం వెల్గనూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. రబీ సీజన్ లో జొన్న పంట సాగుకు నిజాంసాగర్ ప్రాజెక్టు నీరు గ్రామానికి దగ్గరగా ఉన్నప్పటికీ సాగు, తాగు నీటికి ఉపయోగంలో లేదని కలెక్టర్ కు వివరించారు. అనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వెల్గనూర్ గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లను కలెక్టర్ శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా సహకార అధికారి రాంమోహన్, జిల్లా పౌరసరఫరాల అధికారి నరసింహారావు, తహశీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో గంగాధర్, పాక్స్ ఛైర్మన్ నరసింహా రెడ్డి, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.