అక్షరటుడే, బోధన్: మండలంలోని సిద్దాపూర్ క్వారీ నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలించవద్దని ఎస్సై మచ్చేందర్రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం పోలీసులు పలు ఇసుక ట్రాక్టర్లను తనిఖీ చేశారు. డీడీ చెల్లించి అనుమతి పొందాలని, లేనిపక్షంలో ట్రాక్టర్లను సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.