అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: టీజీవో జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్‌కు ఇటీవల టాటా గ్రూపు ఆధ్వర్యంలో దేశ రత్న అవార్డు వరించింది. దీంతో బుధవారం జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాల ఆవరణలో నిర్వహించిన తెలంగాణ గెజిటెడ్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో ఆయనను సన్మానించారు. అనంతరం ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ సభ్యులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, జనరల్‌ సెక్రెటరీ అమృత్‌ కుమార్, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ తిరుపతిరావు, దేవిసింగ్, నాగమోహన్, సంఘసభ్యులు హన్మంత్‌ రెడ్డి, ప్రవీణ్, లావణ్య, సాయిలు, సాయికృష్ణ, గోపికృష్ణ, నాగరాజు, పావని, చందర్, స్వామి, జగదీష్‌ పాల్గొన్నారు.