అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండలంలోని తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గృహంలో బుధవారం అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ పడిపూజలో ఆర్డీవో ప్రభాకర్, సీఐ రవీందర్ నాయక్, ఎస్సై మహేష్, ఎల్లారెడ్డి ఏఎంసీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రజిత, కాంగ్రెస్ నాయకులు వెంకట్రాంరెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు తీసుకున్నారు.