అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : జిల్లాకేంద్రంలోని స్వధార్‌ హోం నుంచి ఓ మహిళ అదృశ్యమైంది. రుద్రూర్‌కు చెందిన ఫర్జానా(35)ను ఏడునెలల కిందట సఖి కేంద్ర నిర్వహకులు స్వధార్‌ హోంలో ఆశ్రయం కల్పించారు. ఈ క్రమంలో ఈనెల 26న అర్ధరాత్రి హోం నుంచి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో హోం కౌన్సెలర్‌ అరుణ త్రీ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌హెచ్‌వో మహేశ్‌ తెలిపారు.