అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాలు అదానీ అంశంపై చర్చకు పట్టబడుతున్నాయి. అదానీ వ్యవహారంలో పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. గురువారం ఉదయం లోక్‌సభ, రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో సభలు ప్రారంభమైన కాసేపటికి ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.