అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : అసెంబ్లీలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం పెట్టాలని జెడ్పీ మాజీ ఛైర్మన్ విఠల్ రావు కోరారు. జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా వినాయక్ నగర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు, మహిళలకు చదువుకునే అవకాశం కల్పించిన మహనీయుడు పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ శంకర్, శేఖర్, రాజు, హనుమాగౌడ్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.