అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : మహారాష్ట్రలోని మెగా చమురు శుద్ధి కర్మాగారాన్ని మించిన రెండు ప్రాజెక్టులు.. గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ లలో ఏర్పాటు కాబోతున్నాయి. ఒక్కొక్కటి 10-15 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన వీటి ఏర్పాటు కోసం సౌదీ అధికారులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. గుజరాత్‌లోని రిఫైనరీ కోసం సౌదీ అరామ్‌కో భాగస్వామిగా ఓ ఎన్ జీ సీ ప్రతిపాదించగా.. ఆంధ్రాలో భారత్ పెట్రోలియం భాగస్వామి కానుంది. చమురు సంపన్న దేశం భారతదేశంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని గతంలో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా వచ్చే నెలలో సౌదీ నాయకత్వంతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో ..

స్థానికుల నుంచి ప్రతిఘటన కారణంగా భూసేకరణలో పురోగతి నెమ్మదిగా ఉంది.

గుజరాత్ లో..

ఇప్పటికే జామ్‌నగర్ (రిలయన్స్, న్యారా ఎనర్జీ), వడోదర (ఇండియన్ ఆయిల్)లో రిఫైనరీలను కలిగి ఉన్న గుజరాత్‌కు నాల్గవది లభించే అవకాశం ఉంది.