అక్షరటుడే, జుక్కల్: పార్లమెంట్ ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ ఆవరణలో గురువారం జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్‌ను అభినందించారు. ఇటీవల మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగగా.. సురేశ్ షెట్కార్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. కాంగ్రెస్ అభ్యర్థి బలవంత్‌రావు రవీందర్ చౌహాన్ గెలుపులో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో షెట్కార్‌ను రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా అభినందించారు.