అక్షరటుడే, బోధన్‌: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచేలా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలని ఎంఈవో నాగయ్య సూచించారు. పట్టణంలోని డిప్యూటీ డీఈవో కార్యాలయంలో గురువారం ఆయా పాఠశాలల హెచ్‌ఎంలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారు. డిసెంబర్‌ 4న జరిగే నాస్‌ పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. సమావేశంలో కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు సూర్యకుమార్, రత్నాకర్, ఆవీఫొద్దీన్, సీఆర్పీలు, కో-ఆర్డినేటర్‌ నాగేష్‌ పాల్గొన్నారు.