అక్షరటుడే, వెబ్డెస్క్ : తెలంగాణలో పదో తరగతి మార్కుల విధానంలో కీలక మార్పు జరిగింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్నల్ మార్కులు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై 100 మార్కులకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.