అక్షరటుడే, కామారెడ్డి: బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అత్యాచారం చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. రామారెడ్డి ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ఏడాది కాలంగా ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డి రూరల్ సీఐ రమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.