అక్షరటుడే, జుక్కల్ : హైదరాబాద్ గాంధీభవన్ లో టీపీసీసీ కనెక్ట్ సెంటర్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సందర్శించారు. కుల గణన కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకమైందని, ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవబోతుందని పేర్కొన్నారు. ఆయన వెంట పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్ ఉన్నారు.