అక్షరటుడే ఆర్మూర్: ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే రైతుబంధు జమ చేయాలన్నారు. అవసరమైన మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా కాంగ్రెస్ నాయకులపై రైతులు ఒత్తిడి తేవాలన్నారు. రైతులు ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకొని నష్టపోవద్దని ఆయన సూచించారు. రైతుల పక్షాన తమ పార్టీ ఎప్పటికప్పుడు పోరాడుతుందని, సమస్యలు పరిష్కరించే వరకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, దొన్కంటి నర్సయ్య, దేవేందర్ పాల్గొన్నారు.