అక్షరటుడే, వెబ్ డెస్క్: భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ట్వీట్ చేశారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. ‘నేను రీఫ్రెష్ కావాలనుకుంటున్నా. అందుకే కొన్ని రోజులు అన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను మర్చిపోరని ఆశిస్తున్నాను.’ అని పోస్ట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.