అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: కామారెడ్డి మండలం ఉగ్రవాయి శివారులో గుర్తు తెలియని యువకుడు మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సై రాజు పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రవాయి గ్రామ శివారులోని హై టెన్షన్ వైర్ల సమీపంలో శనివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు సమాచారం అందించారు. మృతుడి వయస్సు (25-30) వరకు ఉంటుందని ఎస్సై తెలిపారు. కుడి చేతి మణికట్టుపై AA అనే పచ్చబొట్టు ఉందన్నారు. మృతుడు లైట్ బ్లాక్ కలర్ జీన్స్ పాయింట్ బ్లూ కలర్ స్వెటర్ గ్రీన్ కలర్ టీ షర్టు ధరించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.