అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: దోమకొండ మండల కేంద్రంలోని గడికోట మహాదేవుని ఆలయంలో శనివారం కార్తీక మాసం చివరి రోజు పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా శివలింగానికి అర్చకులు విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు.