అక్షరటుడే, ఇందూరు: మాక్లూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను శనివారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో ప్రవేశాలు, భోధనా తరగతుల తీరుపై రా తీశారు. ప్రధానంగా రహదారి నుంచి కళాశాల వరకు రోడ్డు నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఉపాధి హామీ పథకం నిధులతో రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనను పంపాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్టీవో రాజేంద్రకుమార్, కళాశాల ప్రిన్సిపాల్ శాంతి సుభాష్ తదితరులున్నారు.