అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి హెచ్చరించారు. ఆర్మూర్ సీ కన్వెన్షన్ హాల్లో శనివారం ఆయన మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలపై జీవన్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీ గురించి మరొక్క సారి మాట్లాడితే జీవన్ రెడ్డి చిట్టా బయటపెడతామన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ మున్ను, ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, కౌన్సిలర్ ఆకుల రాము, నాయకులు పండిత్ పవన్, జిమ్మీ రవి, కొంతo మురళి, ఎస్ కే బబ్లు తదితరులు పాల్గొన్నారు.