అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ నగరంలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ హల్‌చల్ చేశాడు. హైదరాబాద్ రోడ్‌లో సోమవారం సాయంత్రం మద్యం మత్తులో డ్రైవర్ మహమ్మద్ ఇసాక్ అంబులెన్స్ ను అతివేగంగా నడిపి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో అంబులెన్స్‌లో పేషెంట్లు లేకున్నప్పటికీ.. సైరన్ వేసుకుని వెళ్తున్నాడు. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేయగా అతిగా మద్యం తాగినట్లు గుర్తించారు. ఆల్కహాల్ శాతం 120 పైబడి వచ్చింది. కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు ట్రాఫిక్ సీఐ పబ్బ ప్రసాద్, ఎస్సై సంజీవ్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.