అక్షరటుడే, బోధన్: పట్టణంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణం కోసం స్థలాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. పట్టణ శివారులోని బెల్లాల్ వద్ద స్థలాన్ని చూశారు. త్వరలో భవన నిర్మాణం చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వారి వెంట సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ ఛైర్మన్ పద్మాశరత్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సంధ్యా దామోదర్, పీసీసీ డెలిగేట్ గంగశంకర్ తదితరులున్నారు.