అక్షరటుడే, ఇందూరు: రాష్ట్ర ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో 66 వాగ్దానాలు నెరవేరుస్తామని చెప్పి.. ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై చార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరంగల్, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్ లో కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. జక్రాన్ పల్లిలో ఎయిర్ పోర్టు నిర్మిస్తామని, బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి మరిచారన్నారు. జిల్లాలో రెండు లక్షల మంది రైతులకు మాఫీ చేయలేదని పేర్కొన్నారు. మంచిప్ప రిజర్వాయర్ రీడిజైన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, నాయకులు గద్దె భూమన్న, ఇప్పకాయల కిషోర్, కిషన్, స్వామి యాదవ్, పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.