అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: మాచారెడ్డి ఎంపీడీవో కాంప్లెక్స్ లో శిథిలావస్థకు చేరిన భవనాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం పరిశీలించారు. సదరు భవనం స్థానంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం మాచారెడ్డి మెయిన్ రోడ్డులో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో సక్రమంగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావును ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శ్వేత, ఎంపీడీవో గోపి బాబు, పంచాయతీ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.