అక్షరటుడే, భిక్కనూరు: మండలంలోని కాచాపూర్‌కు చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మల్లారెడ్డిని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరామర్శించారు. మల్లారెడ్డి తల్లి రాజమణి ఇటీవల మృతి చెందారు. దీంతో గంప గోవర్ధన్ గురువారం మల్లారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట నాయకులు సాయగౌడ్, రాజిరెడ్డి, మురళి తదితరులున్నారు.