అక్షరటుడే, భిక్కనూరు: యువత రాజకీయాల్లోకి రావాలని పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. భిక్కనూరు మండల యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీరాం వెంకటేశ్‌ను గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతో పాటు రాజకీయాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మైపాల్ రెడ్డి, దయాకర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.