అక్షరటుడే, వెబ్ డెస్క్: పుష్ప-2 ది రూల్ మొదటి రోజు ₹175 కోట్లు సంపాదించి అతిపెద్ద భారతీయ ఓపెనర్‌గా అవతరించింది. ఈ సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డును అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా ₹263 కోట్లు వసూలు చేసింది. ఒకే రోజులో తెలుగులో ₹95.1 కోట్లు, హిందీలో ₹67 కోట్లు, తమిళంలో ₹7 కోట్లు రాబట్టింది. బుక్ మై షో లో కేవలం గంటలోనే లక్షకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇలా ప్రభాస్ మూవీ కల్కి-2898 ADని సైతం అధిగమించింది. కల్కి-2898 AD మూవీ.. గంటలో విక్రయించిన టికెట్లు 97,700 కావడం గమనార్హం. కాగా విజయ్ దేవరకొండ, తన తల్లి తోపాటు తమ్ముడు ఆనంద్ దేవరకొండ, రష్మికతో కలిసి గురువారం ఈ చిత్రాన్ని తిలకించారు.