అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇక బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. మరో బాలుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. హీరో అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యం, చిత్ర యూనిట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో తిరిగి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.