అక్షరటుడే, ఆర్మూర్ : బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి తరలి వెళ్లకుండా ఆర్మూర్ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, రవి, అగ్గు క్రాంతి, మీరా శ్రవణ్, మహమ్మద్ సైఫ్, రాజు, చింటూ, హరీష్ ఉన్నారు.