అక్షరటుడే, ఇందూరు: సైన్స్, గణితంలో ప్రయోగాలతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో జిల్లాస్థాయి ఇన్స్పైర్, సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మోడీ హయాంలో దేశం వైజ్ఞానిక పరంగా ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఇందుకు చంద్రయాన్-2 విజయమే ఉదాహరణ అన్నారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కు తొలిమెట్టు అన్నారు. అంతకుముందు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీఈవో అశోక్, డీఐఈవో రవికుమార్, డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏడీ నాగజ్యోతి, అన్ని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, స్థానిక కార్పొరేటర్ పాల్గొన్నారు.