అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని పులాంగ్ చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. కార్యక్రమంలో దర్శనం దేవేందర్, కరిపే రవీందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, వాసం జయ, బాలన్న తదితరులు పాల్గొన్నారు.