అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: జిల్లాలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను హోంగార్డులను సన్మానించారు. శుక్రవారం హోంగార్డు సంస్థ 75వ రైజింగ్‌ డే సందర్భంగా సీపీ కార్యాలయంలో అదనపు సీపీ(అడ్మిన్‌) కోటేశ్వరరావు ఐదుగురు హోంగార్డులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. స్వామి(ఆర్మూర్‌), పోతన్న(బోధన్‌ రూరల్‌), జీవన్‌సింగ్‌(ట్రాఫిక్‌ పీఎస్‌), రఘువీర్‌(నిజామాబాద్‌ 3వ టౌన్‌), షేక్‌ ఖాజా(ఏపీసీ కార్యాలయం)ను అభినందించారు. కార్యక్రమంలో అదనపు పోలీస్‌ కమిషనర్‌(ఏఆర్‌) శంకర్‌ నాయక్‌, సతీశ్‌, తిరుపతి, సీఐ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.