అక్షరటుడే, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్లీపర్ కోచ్ – ట్రక్కు ఢీకొన్న ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. మరో 19 మందికి గాయాలయ్యాయి. కన్నౌజ్ జిల్లాలోని ఔరైయా సరిహద్దు సమీపంలో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. సాకరవ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున 40 మంది ప్రయాణికులతో లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సు.. వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టింది.